»My Married Life Should Be Like Aaradhya Vijay Deverakonda Comments Viral
Vijaydevarakonda: నా వైవాహిక జీవితం ‘ఆరాధ్య’ లాగే ఉండాలి.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హిట్ చూసి చాలా కాలం అవుతోంది. అయినా కూడా రౌడీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటాడు.. ఫ్యాన్స్‌కు సర్ప్పైజ్లు ఇస్తుంటాడు.. ఏదో ఓ రకంగా లైమ్ లైట్లో ఉండడం రౌడీ స్టైల్. ఇక రష్మికతో రౌడీ ఎఫైర్ గాసిప్స్ వస్తునే ఉన్నాయి. కానీ ప్రస్తుతం సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఖుషి సినిమాలోని కొత్త సాంగ్ రిలీజ్ సందర్భంగా.. వైవాహిక జీవితం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
లైగర్ సినిమా(Liger Movie) హిట్ అయి ఉంటే.. రౌడీ రేంజ్ వేరే లెవల్లో ఉండేది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో.. విజయ్ దేవరకొండ(Vijaydevarakonda) సీన్ రివర్స్ అయిపోయింది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా ఆగిపోయింది. ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటిస్తోంది. ఖచ్చింతగా ఖుషితో రౌడీ హిట్ కొడతాడనే నమ్మకం కలిగించేలా.. ఈ సినిమా సాంగ్స్ బయటికొస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినా ‘నా రోజా నువ్వే’ సాంగ్.. సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక రీసెంట్గా ఈ సినిమా నుంచి మరో లవ్ మెలోడి ‘ఆరాధ్య’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు.
సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటను కూడా శివ నిర్వణే లిరిక్స్ అందించాడు. ఈ పాట కూడా స్లో పాయిజన్‌లా హిట్ అనిపించుకుంటోంది. సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు. అయితే ఈ సాంగ్ రిలీజ్‌కు ముందు.. వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను వివాహం చేసుకున్నాక ఈ పాటలో చూపించిన విధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ‘ఖుషి’లో తనకు ఇష్టమైన పాటల్లో ఆరాధ్య కూడా ఒకటి. తాను పెళ్లి చేసుకున్న తర్వాత.. సంవత్సరం పాటు జంట ఎలా ఉంటుందో ఈ పాటలో చూపించారు. ఎంతో అద్భుతంగా సాగే ఈ పాటలో భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని అందంగా చిత్రీకరించారు.
నేనింకా పెళ్లి చేసుకోలేదు కానీ, భవిష్యత్తులో నా వైవాహిక జీవితం ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని చెప్పుకొచ్చాడు రౌడీ హీరో. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్. అలాగే గీతా గోవిందం సీక్వెల్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హిట్ పెయిర్ రౌడీ, రష్మిక మరోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. ఆన్ స్క్రీన్లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోను విజయ్, రష్మిక మధ్య ఎఫైర్ ఉందనేది ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రౌడీ చేసిన కామెంట్స్‌కు రష్మికను యాడ్ చేసి.. తనేనా నీ లైఫ్ పార్ట్నర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.