సమంత(Samantha) గురించి ఎలాంటి న్యూస్ బయటికి వచ్చినా క్షణాల్లో వైరల్గా మారుతుంది. సామ్ అంటేనే సోషల్ మీడియాలో సెన్సేషన్. అలాంటి సమంత.. ఓ ఏడాది పాటు సినిమాలకు దూరమవుతోందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయితే.. సమంత నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోవడంతో.. ఇందులో నిజం లేదనుకున్నారు. కానీ తాజాగా సామ్ షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది.
రీసెంట్గా కారవాన్ ఫొటో షేర్ చేస్తూ.. ‘మరో మూడు రోజులు మాత్రమే ఈ కారవాన్లో ఉండేది’ అని రాసుకొచ్చింది సమంత(samantha). అలాగే తన ఫొటో ఒకటి పెట్టి.. ‘ఆరు నెలలు కష్టంగా గడపడానికి సిద్ధపడాలి. ఎలాగైనా దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది’ అని పోస్ట్ చేసింది. దీంతో.. నిజంగానే సమంత సినిమాలకు కొన్నాళ్లు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ మధ్య మయో సైటిస్ కారణంగా.. సినిమాలకు దూరమైంది సమంత. ఈ మధ్యే సామ్ కోలుకుంది. వరుస ప్రాజెక్ట్స్ కూడా కమిట్ అయింది. కానీ మరోసారి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల.. లాంగ్ బ్రేక్ తీసుకోబోతోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న సినిమాల షూటింగ్ దాదాపుగా పూర్తైపోయినట్టే.
బాలీవుడ్లో నటిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్, తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. అందుకే.. మరో మూడు రోజుల్లో మాత్రమే కారవాన్లో ఉంటానని.. పోస్ట్ పెట్టింది సమంత. అయితే తాజాగా ఈ రోజు తన జీవితంలో ఎంతో స్పెషల్ డే అంటూ మరో పోస్ట్ చేసింది. జులై 13 నా జీవితంలో ఎంతో స్పెషల్ డే. ఎందుకంటే ఈ రోజుతో సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయింది.. అని ఓ ఫొటోను షేర్ చేసింది. దీంతో.. ఇక సమంత సినిమాలకు గుడ్ బై(goodbye) చెప్పేసినట్టే.. ఈ రోజు నుంచే ఆమె బ్రేక్ డే స్టార్ట్ అయిపోందని చెప్పొచ్చు. దాదాపు ఆరు నెలల నుంచి ఏడాది కాలం పాట్ సామ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో సామ్ అభిమానులు త్వరగా కోలుకుని.. మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు.