Video Call: న్యూడ్‌గా యువతి వీడియోకాల్.. తర్వాత వ్యాపారికి బెదిరింపులు, ఏమైందంటే..?
సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన యువతితో ఓ వ్యాపారి వీడియో కాల్ మాట్లాడాడు. తర్వాత వీడియో క్లిప్సింగ్, ఆడియో క్లిప్పింగ్ పంపించి బెదిరించింది. దీంతో ఆ వ్యాపారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు.
Video Call: సోషల్ మీడియాలో (social media) కొందరు అట్రాక్ట్ అవుతున్నారు. లేడీస్ కనబడితే చాలు కనెక్ట్ అవుతున్నారు. తర్వాత వీడియో కాల్ (video call) అని టెంప్ట్ చేస్తే.. మాట్లాడతారు. ఇంకేముంది ఆ కాల్ రికార్డ్ చేసి.. బెదిరింపులకు దిగుతారు. దేశంలో రోజుకో ఘటన వెలుగు చూస్తోంది. ఒడిశాలో (odisha) ఓ వ్యాపారి యువతికి చిక్కి.. సూసైడ్ చేసుకుందామని ట్రై చేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.
భువనేశ్వర్ (bhuvaneshwar) నయాపల్లికి చెందిన వ్యాపారికి ఫేస్బుక్లో ఓ యువతి పరిచయం అయ్యింది. తర్వాత ఇద్దరూ వాట్సాప్ చాట్ చేసుకున్నారు. మంగళవారం ఆ యువతి కోరిక మేరకు వీడియో కాల్ చేశాడు. అప్పుడు యువతి న్యూడ్‌గా ఉంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుతున్నారు. ఫోన్ కట్ చేసిన తర్వాత వారి మాటలు, వీడియోను (video) ఆ యువతి వ్యాపారికి పంపించింది. దీంతో అతను హడలిపోయాడు.
తనకు డబ్బులు ఇవ్వాలని.. లేదంటే వాటిని సోషల్ మీడియాలో (social media) పెడతానని బెదిరించింది. పరువు తీస్తానని వార్నింగ్ ఇచ్చింది. యువతి చర్యల గురించి అతను సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి ఇష్యూ సాల్వ్ చేయకుండా హేళనగా మాట్లాడరట. ఇంకేముంది తన షాప్ వద్దకు వచ్చి.. కత్తెరతో పొట్టలో పొడుచుకుని సూసెడ్ అటెంప్ట్ చేశాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.