BHNG: భువనగిరి మున్సిపాలిటీ 25వ, వార్డులో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు. రూ.23 లక్షలతో మున్సిపల్ ఛైర్మన్ తంగలపల్లి శ్రీవాణి రవికుమార్, వార్డ్ కౌన్సిలర్ బెండ స్వరూప లాల్ రాజ్ పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.