Congress defeated in Telangana elections 2023 Victory in Aswaraopeta and yellandu
పవన్ కల్యాణ్ పై కేసు నమోదైంది. పవన్ పై సురేష్ అనే వాలంటీర్ ఫిర్యాదు మేరకు కృష్ణ లంక పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో అమ్మాయిల ట్రాఫికింగ్ విషయంలో వాలంటీర్ల పాత్ర ఉందని ఇటివల ఏలూరు వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. మహిళల అక్రమ రవాణా విషయంలో వాలంటీర్ల పాత్ర ఉందని ఆరోపించారు. దీంతో ఈ అంశంపై అక్కడి వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇటీవల పలువురు వాలంటీర్లు మహిళల లేదా బాలికలపై అత్యాచారం చేసిన అంశాలు కూడా వెలుగులోకి రావడం వాలంటీర్ల సేవలపై అనుమానం వ్యక్తమవుతోంది.