ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వచ్చాక దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.15గా ఉంటుందని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. నేడు తిరుపతి(Tirupati)లోని రేణిగుంట (Renigunta) విమానాశ్రయం సమీపంలోని కొత్తపాలెం జాతీయ రహదారి వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బయో ఇథనాల్ తో నడిచే బైక్ లను కొన్ని ప్రైవేట్ సంస్థలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాయని ఆయన వెల్లడించారు. పెట్రోల్ లీటర్ రూ.110 ఉందని, ఇథనాల్ మాత్రం రూ.60కే లభిస్తుందని గడ్కరీ చెప్పారు. బయో ఇథనాల్(Bio ethanol) వాడేందుకు సిద్ధంగా వాహనాలు తయారవుతున్నాయని తెలిపారు. దేశంలో పెట్రోల్ వినియోగంతో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తాము ఇతర మార్గాలపై దృష్టిపెట్టామని చెప్పారు. ఇథనాల్, మిథనాల్ వినియోగం వైపునకు మళ్లాల్సి ఉందన్నారు.