Chandrababu is the only one in the quota and the only one in the Peta
Kodali Nani: మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) ఆరోగ్యం బాగేలేదని.. ఆయనకు క్యాన్సర్ సోకిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్వయంగా స్పందించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని.. తనకే సమస్య లేదని స్పష్టం చేశారు. ఇదంతా టీడీపీ చేస్తోన్న విష ప్రచారం అని తెలిపారు. ఐ-టీడీపీ దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ నేతలు ఈ స్థాయికి దిగజారరని కొడాలి నాని (Kodali Nani) పేర్కొన్నారు. తాను హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అని తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నానని.. చంద్రబాబును పాలిటిక్స్ నుంచి తప్పించే వరకు బాగుంటానని తెలిపారు. ఏపీ నుంచి పంపించే వరకు భూమి మీద ఉంటానని స్పష్టంచేశారు.
తనకు ఆరోగ్యం బాగుందని.. ఐ టీడీపీ చేస్తోన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. ఇలాంటివి ఎన్ని చేసినా తనకేం కాదని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పదవీ పోయిన తర్వాత కొడాలి నాని యాక్టివ్ పాలిటిక్స్‌కు కాస్త దూరంగా ఉన్నారు. ఎప్పుడో ఓ సారి మీడియా ముందుకు వస్తున్నారు. అందుకే హెల్త్ ఇష్యూ అని తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యారు.