హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రమైంది. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం కారణంగా చాలా హాస్టళ్లు వంటల కోసం కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నాయి. దీనివల్ల వెలువడే భారీ పొగతో ఐటీ ప్రాంతం మొత్తం కాలుష్యమయంగా మారింది. ఉపాధి కోసం వచ్చిన వేలాది మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.