AP: మచిలీపట్నం ‘జనసేన జెండా వివాదం’ నేపథ్యంలో మాజీమంత్రి పేర్ని నాని, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసుల ఆంక్షలపై నాని మండిపడ్డారు. YCP నేతలను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, పార్టీ ఆఫీసుకు వెళ్తున్న తనను అడ్డుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.