SRCL: కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ ఇవాళ ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో భాగంగా సిరిసిల్ల 33వ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి – నరేష్ పాల్గొని ఎంపీని ఘనంగా సన్మానించారు. కొండగట్టు వరకు 40 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో సిరిసిల్ల నుంచి బీజేపీ ప్రజాప్రతినిధులు, వేలాదిగా కార్యకర్తలు, భక్తులు తరలివచ్చారు.