NGKL: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పదో తరగతి విద్యార్థుల సౌకర్యార్థం కోసం డిపో మేనేజర్ యాదయ్య ఆదేశాల మేరకు ఈరోజు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బస్సుల వేళలు, రూట్ల గురించి సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను ఇక్కడ తెలియజేయవచ్చన్నారు.