బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(shah rukh khan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు షారుఖ్. కానీ ఇటీవల వచ్చిన పఠాన్ సినిమా షారుఖ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా జవాన్‌గా వస్తున్నాడు కింగ్ ఖాన్. తాజాగా రిలీజ్ అయిన జవాన్(jawan) ట్రైలర్.. ఒక్కసారిగా అంచనాలను ఆమంతం పెంచేసింది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(shah rukh khan) నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్.. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. యావరేజ్ టాక్‌తోనే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్‌ను తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దాంతో వెయ్యి కోట్లు రాబట్టింది పఠాన్. ఈ సినిమాతో కింగ్ ఖాన్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇదే జోష్‌లో జవాన్‌గా రాబోతున్నాడు షారుఖ్. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన జవాన్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలును పెంచేశాయి. అందుకే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ కోసం షారుఖ్ ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా జవాన్ ప్రివ్యూను రిలీజ్ చేశారు మేకర్స్.
దాదాపు రెండు నిమిషాల ఈ ప్రీవ్యూ చూసి షారుఖ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. నేనేవరిని అంటూ మొదలైన ట్రైలర్.. అట్లీ యాక్షన్ మార్క్‌తో అదిరిపోయిందనే చెప్పాలి. ఈ సినిమలో దీపికా పదుకొనే స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వగా.. విజయ్ సేతుపతి కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అలాగే ప్రియమణి కూడా స్పెషల్ రోల్లో ఫైట్స్ చేస్తూ కనిపించింది. ఈ ట్రైలర్(trailer)లో షారుఖ్ ఖాన్ చాలా వేరియేషన్స్‌లో కనిపించాడు. ట్రైలర్ మొత్తం షారుఖ్ ఖాన్ చుట్టే తిరిగింది. ముఖ్యంగా ట్రైలర్ ఎండింగ్లో షారుఖ్ ఖాన్ గుండు లుక్ చూస్తే ఔరా అనాల్సిందే. ఈ ప్రివ్యూ వీడియోని అనిరుద్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఓ రేంజ్లో ఎలివేట్ చేసాడు. ఫైట్స్, సెట్స్, హ్యుజ్ స్టార్ కాస్ట్.. ఇలా అన్ని విధాలుగా పక్కా కమర్షియల్ ఫిల్మ్‌గా జవాన్ వస్తోంది. మొత్తంగా తల్లికి ఇచ్చిన మాట కోసం జవాన్ ఏం చేసాడు? అనే పాయింట్లో ఈ స్టోరీ సాగుతుందని చెప్పొచ్చు. సెప్టెంబర్ 7న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో షారుఖ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.