తెలంగాణ(Telangana)లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ బీఆర్ఎస్ (BRS) కు షాకిచ్చేందుకు మరో నేత సిద్ధమయ్యారు.పాలమూరు సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి (MLC Damodar Reddy)మళ్లీ తన సొంత గూటికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం బీఆర్ఎస్లోకి వచ్చిన ఆయన.. ప్రస్తుతం అవలంబిస్తోన్న చర్యలు చూస్తుంటే కాంగ్రెస్ (Congress)లోకి వెళ్లటం ఖాయమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ మధ్య దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi)తో దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు భేటీ అయ్యారు.
దీంతో.. కాంగ్రెస్లోకి వెళ్లనున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. దామోదర్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో భేటీ కావటంపై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. కాగా.. ఇప్పటికే.. మహబూబ్నగర్ జిల్లా(Mahbubnagar District)కు చెందిన ప్రముఖ నేత జూపల్లి కృష్ణారావు పార్టీ నుంచి సస్పెండ్ కాగా.. ఆయన కూడా కాంగ్రెస్లో చేరేందుకు సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సమక్షంలో చేరిక దాదాపు ఖరారు అయింది. నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ప్రత్యక్షమైన దామోదర్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు వంశీచంద్ రెడ్డి, మల్లు రవి, నాగం జనార్దన్ రెడ్డి. పాల్గొన్నరు
బీఆర్ఎస్ పార్టీ కి షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి చేరికకు తెర. నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ప్రత్యక్షమైన దామోదర్ రెడ్డి.