ఆర్ఆర్ఆర్ తర్వాత కాస్త దూకుడు మీదున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సెట్స్ పై ఉన్నప్పుడే.. శంకర్ దర్శకత్వంలో 15వ సినిమా మొదలు పెట్టాడు చరణ్. ఇక శంకర్ సినిమా సెట్స్ పై ఉండగానే.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు చరణ్. అయితే ఆర్సీ 15 మొదలైన తర్వాత.. స్టార్టింగ్‌లో జెట్ స్పీడ్‌తో షూటింగ్ చేశాడు శంకర్. కానీ విక్రమ్ వంటి సాలిడ్ హిట్ తర్వాత మళ్లీ ఇండియన్ 2ని లైన్లోకి తీసుకున్నాడు కమల్ హాసన్. అనుకున్నదే ఆలస్యమన్నట్టు.. ఆర్సీ 15తో పాటే సమానంగా ఇండియన్ 2 షూటింగ్ చేస్తున్నాడు శంకర్. ఇక చరణ్, నిర్మాత దిల్ రాజు చేసేదేం లేక ఆర్సీ 15 షూటింగ్‌ను ఇండియన్ 2 తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సంక్రాంతికే రావాల్సి ఆర్సీ 15.. వచ్చే సమ్మర్‌కి షిఫ్ట్ అయింది. అయితే ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. ‘ఇండియన్ 2’ సినిమాను ఈ ఏడాది సమ్మర్ చివర్లో రిలీజ్ చేయడమే టార్గెట్ పెట్టుకున్నాడట కమల్ హాసన్. ఇదే నిజమైతే.. ఆర్సీ 15 ఈ ఏడాదిలో రిలీజ్ అవడం కష్టమేనని అంటున్నారు. వీలైతే.. ఈ ఏడాది చివరలో.. లేదంటే 2024 సంక్రాంతికి రిలీజ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆర్సీ 15 రిలీజ్ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. ఇకపోతే.. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అంజలి, శ్రీకాంత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.