MLG: ములుగు మండలం జాకారం గ్రామ సర్పంచ్ దాసరి సమత శుక్రవారం సాయంత్రం ఓ రసాయన మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే MLG జిల్లా ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఉప సర్పంచ్ వేధింపులకు మనస్తాపం చెంది ఈ చర్యకు పాల్పడ్డానని సర్పంచ్ తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.