»Adipurush Writer Manoj Mumtaz Apologized To People With Folded Hands
Manoj muntashir: చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ఆదిపురుష్ రచయిత
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్(Adipurush) చిత్రంలో పలు సన్నివేశాలు, డైలాగ్స్ వివాదాస్పందంగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియోలా ఈ అంశంపై పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఈ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్(manoj muntashir) స్పందించారు. ఈ చిత్రం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు శనివారం బహిరంగ క్షమాపణలు(apologized) చెప్పారు.
ఆదిపురుష్(Adipurush) వివాదం అంతం లేనిది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి నిరంతరం సవాళ్లను ఎదుర్కొంటోంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చిన తర్వాత కూడా వివాదం మాత్రం తగ్గలేదు. మంచి పౌరానిక కథ అయిన రామాయణంను చెడుగా చిత్రీకరించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా డైలాగ్లపై వచ్చిన కామెంట్లపై కొద్ది రోజుల తర్వాత రచయిత మనోజ్ ముంతాషిర్(manoj muntashir) చివరకు క్షమాపణలు చెప్పాడు.
‘ప్రజల భావోద్వేగాలను’ దెబ్బతీసినందుకు ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతాషిర్ ‘చేతులు జోడించి క్షమాపణలు(apologized) చెబుతున్నట్లు సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ప్రకటించారు. ఆదిపురుష్ మూవీ వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రభువు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి, మన పవిత్రమైన సనాతన సంప్రదాయ గౌరవాలని పాటిస్తూ గొప్ప దేశానికి సేవ చేయడానికి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఇటీవల విడుదలైన ఆదిపురుష్ చిత్రంపై ప్రముఖ రచయిత మనోజ్ ముంతాషీర్ సైతం విమర్శలు ఎదుర్కొన్నారు. పౌరాణిక చిత్రానికి సంబంధించిన డైలాగులు ఆయనే రాశారు. ఓం రౌత్ దర్శకత్వంలో వాడిన పదాలతో రామాయణంలోని సారాంశాన్ని నాశనం చేశారని పలువురు ఆరోపించారు. వాటిపై స్పందించిన మనోజ్ తాజాగా క్షమాపణలు చెప్పాడు.