»Hindu Man Wears Burqa To Get Free Bus Seat In Karnataka
Karnataka: కర్ణాటకలో బుర్ఖా ధరించి పట్టుబడ్డ వ్యక్తి
కర్ణాటక ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన శక్తి యోజన పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ పథకాన్ని ఆసరాగా తీసుకొని ఒక వ్యక్తి బుర్ఖా ధరించి బస్ స్టాప్ లో పట్టుబడ్డాడు.
Hindu man wears burqa to get free bus seat in Karnataka
కర్ణాటక రాష్ట్రంలో ధార్వాడ్ జిల్లాలోని స్థానిక బస్టాప్‌లో బుర్ఖా ధరించిన హిందూ వ్యక్తి(Hindu man wears burqa) అనుమానస్పదంగా సంచరిస్తూ తిరుగుతున్నాడు. అనుమానంతో స్థానికులు అతన్ని నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతని పేరు మత్తపాటి వీరభద్రయ్య. ఒంటరిగా కూర్చోని స్థానికులకు కనిపించాడు. ముస్లీం మహిళాల బుర్ఖా ధరించాడు కానీ అతని ప్రవర్తన వింతగా ఉంది. విషయం తెలుకుందామని చుట్టూ ఉన్నవారు తన వివరాలను అడగడం ప్రారంభించారు. ఏ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోవడం, తన గొంతు ఆధారంగా బుర్ఖా ధరించిన పురుషుడిగా గుర్తించి నిలిదీశారు. దాంతో కంగారు పడ్డ వీరభద్రయ్య తాను బిక్షం అడుక్కోవడానికి ఇలా కూర్చున్నాని చెప్పాడు. కానీ అతని మాటలకు అతని ప్రవర్తనకు పొంతన లేకపోవడంతో స్థానికులు గట్టిగా నిలిదీశారు.
దీంతో అసలు విషయం బయటపడింది. కర్ణాటక ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శక్తి యోజన(Shakti Yojana) పథకం కింద స్త్రీలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చారు. వీరభద్రయ్య స్త్రీ వేషాధారణతో టికెట్టు లేకుండా ప్రయాణం చేయడానికి ఈ ప్లాన్ చేసుకున్నట్లు బయటపడింది. అతని దగ్గర మహిళా పేరుతో ఆధార్ కార్డు కూడా ఉంది. కర్ణాటక(Karnataka) ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం శక్తి యోజన పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న స్థానికులు ఇలా చేయడం చట్టరిత్య నేరం అని మందలించి వదిలేశారు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ వార్త సంచలనగా మారింది.