SKLM: పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొని విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో పదో తరగతి పరీక్షలు కీలకమైన దశ అని అన్నారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు.