MDK: తూప్రాన్ మండలం దాతర్ పల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో RBSK టీమ్ డాక్టర్ మాధురి, జిల్లా ఇమ్యునైజేషన్ టీమ్ సందర్శించారు. ఈ సందర్భంగా గురుకులంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. విద్యార్థులకు HB టెస్ట్ నిర్వహించి, ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారం, HPV వ్యాక్సిన్, CPR ట్రైనింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించారు.