TG: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో పరిస్థితులు దిగజారాయని.. సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బినామీ KLSR కంపెనీ పైన ఉన్న ఆర్థిక పరమైన ఆరోపణలు, కేసులపైన పక్షపాతం లేకుండా, ఒత్తిడి లేకుండా విచారణ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.