WhatsApp new feature available. Good news for WhatsApp users.
WhatsApp: డిజిటల్ యుగంలో అన్ని పనులు ఆన్ లైన్(Online) లోనే చేయడానికి ఇష్టపడుతున్నాము. అందుకే డిజిటల్ పరంగా టెక్నాలజీ(Digital Technology) కూడా రోజురోజుకు అప్డేడ్ అవుతుంది. ఈ రోజుల్లో మొబైల్(Mobile) లేకుండా అందులో వాట్సాప్(WhatsApp) లేకుండా ఎవరన్నా ఉన్నారా… ఉంటే వారిని గ్రహాంతర వాసులుగా పరిగణలోకి తీసుకోవచ్చు అని నేటి యువత భావిస్తున్నారు. మనం పొద్దున లేసింది మొదలు ఫ్రెండ్స్ తో చాటింగ్ అన్నా, ఫ్యామిలీతో మీటింగ్ అన్నా వాట్సాప్ ను ఉపయోగిస్తుంటాము. అయితే ఎప్పటినుండో వాట్సాప్ యూజర్లకు ఒక వెలితి ఉంది. అదేంటంటే వాట్సాప్ ద్వారా ఫోటులు(Photos), వీడియోలు(Videos) పంపించుకుంటే అవి వాటి ఒరిజినల్ క్వాలిటీని కోల్పోతాయి. అందుకే చాలా మంది టెలిగ్రామ్ లాంటి ఇతర సోషల్ మీడియా వేదికలను వాడుతుంటారు. అయితే ఆ సమస్యపై దృష్టి పెట్టిన వాట్సాప్ సరికొత్త ఫీచర్(WhatsApp New Feature) ను పరిచయం చేయనుంది.
ఇప్పటికే ఎన్నో సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ ప్రస్తుతం హై క్వాలిటీ ఫొటోలు, వీడియో షేరింగ్‌పై పని చేస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని WaBetaInfo పేర్కొంది. ఇప్పటికే ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని తెలిపింది. వాట్సాప్ బీటా అప్డేట్ 2.23.14.10లో హై-క్వాలిటీ వీడియోలను పంపగల సామర్థ్యాన్ని పరిచయం చేస్తోంది. వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) నివేదిక ప్రకారం వాట్సాప్ డ్రాయింగ్ ఎడిటర్లో ఓ కొత్త బటన్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్లు హై క్వాలిటీ వీడియోలను వాట్సాప్ ద్వారా నేరుగా పంపించుకునే అవకాశం ఉంటుంది. ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే వీడియో ఒరిజినల్ క్వాలిటీ అలానే ఉండే అవకాశం ఉంది.
మాములుగా మనం గూగుల్(Google) నుంచి ఏదైన వీడియో, ఫోటో డౌన్ లోడ్ చేసినప్పుడు ఏ క్వాలిటీలో కావాలి అని అడుగుతుంది కదా సరిగ్గా అలాగే మనం ఏదైన ఫోటో, వీడియో ఇతరులకు పంపినప్పుడు సైజ్, క్వాలిటీని క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదా ఒరిజినల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. తద్వారా హై క్వాలిటీ వీడియోలను పంపవచ్చు. ఈ ఫీచర్ ను తాజాగా ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా టెస్టర్లు గుర్తించారు. యూజర్లు హెచ్డీ క్వాలిటీ ఆప్షన్‌ను ఉపయోగించి వీడియోను షేర్ చేసినప్పుడు అది కన్వర్జేషన్లో హెచ్డీ వీడియోగా లేబుల్ అయి కనిపిస్తుంది. ప్రస్తుతం బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్నా ఈ ఫీచర్ విజయవంతమైతే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.