ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Prime Minister Modi) నివాసంపై ఈరోజు తెల్లవారుజామున డ్రోన్(drone) కనిపించడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని అధికారిక నివాసం నో ఫ్లై జోన్లోకి వస్తుంది. కానీ ఆ ప్రాంతంలో డ్రోన్ రావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో డ్రోన్ కనిపించింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ(delhi) పోలీసులు డ్రోన్‌ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.