AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్లు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం చెప్పింది. జల్జీవన్ మిషన్ ద్వారా నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. FRA పట్టాదారులకు రాయితీలు కల్పించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదించింది.