Etala Rajender: బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ ఆ పార్టీలో దుమారం రేపింది. ఆ ట్వీట్ గురించి బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ (Etala Rajender) స్పందించారు. ట్వీట్‌కు అర్థమెంటో జితేందర్ రెడ్డినే అడగాలని సూచించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఏదీ పడితే అదీ మాట్లాడొద్దు అని సూచించారు. ఇటీవల జితేందర్ రెడ్డి బీజేపీలో కలిసికట్టుగా లేరున్నట్టు ట్వీట్ చేశారు. దీంతో ఈటల రాజేందర్ (Etala Rajender) స్పందించారు. ఎవరి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించొద్దని ఈటల రాజేందర్ (Etala Rajender) సూచించారు. ఎవరి స్వేచ్చ, గౌరవాన్ని తగ్గించకూడదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ బీజేపీ నేతల్లో ఐకమత్యం లేదని జితేందర్ రెడ్డి ట్వీట్‌తో చెప్పారు. ఇటీవల నేతలతో సమావేశం నిర్వహించి.. బండి సంజయ్ గురించి పొగిడారు. ఆ వెంటనే వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఈటల రాజేందర్ (Etala Rajender) కూడా హై కమాండ్ మీద కినుక వహించి ఉన్నారు. ఏదైనా పదవీ ఇవ్వాలని కోరుతున్నారు. మరో నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.
తెలంగాణ బీజేపీలో బలమైన నేతలు ఉన్నప్పటికీ.. వారి మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తప్పు.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చేలా లేవు. ఈ అంశంపై హై కమాండ్ దృష్టిసారించాలని పొలిటికల్ ఆనలిస్టులు సూచిస్తున్నారు.