SKLM: రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు కీలకమని, వాటిని ఆకర్షించడంలో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతి సచివాలయంలో కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశం రెండోరోజు పెట్టుబడులు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. జిల్లాలను ప్రోత్సహిస్తూ పెట్టుబడులను ఆకర్షించేందుకు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.