KNR: హైదరాబాద్లో చేనేత & టెక్స్టైల్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా (2026–27) మొదటి సంవత్సరం కోర్సుకు 60 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి రాఘవరావు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై 23 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కార్యాలయంలో దరఖాస్తు చేయాలని సూచించారు.