PLD: బొల్లాపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఆరో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ వి.లీలావతి ఇవాళ తెలిపారు. విద్యాలయంలో 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.