NLR: కోవూరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు తావు లేదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. అందరికీ చంద్రబాబు ఒక్కడే నాయకుడని చెప్పారు. అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతి నాయకుడు కలిసి పని చేసుకోవాలని సూచించారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.