యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) కూతురు ఐశ్వర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కొడుకు యంగ్ హీరో ఉమాపతి రామయ్య(Umapati Ramaiah)తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు తంబి రామయ్య (Thambi Ramaiah) ప్రకటించారు. ఇరు కుటుంబాలు ఇటీవల ఇదే అంశంపై మాట్లాడుకున్నామని త్వరలోనే డేట్ ఫిక్స్ చేయనున్నట్లు తెలిపారు.ఇరు కుటుంబాల మధ్య పరిచయాలు ఉన్నాయని, ఈ క్రమంలోనే ఐశ్వర్య (Aishwarya) అంటే తనకు ఇష్టమని ఉమాపతి తమకు చెప్పాడని తెలిపారు.
నవంబర్ 8న ఉమాపతి బర్త్ డే సందర్భంగా పెళ్లి డేట్ ను అఫిషీయల్ గా అనౌన్స్ చేస్తామన్నారు. నెక్ట్స్ ఇయర్ లో వీరి పెళ్లి ఉంటుందని తెలిపారు. అయితే యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో శ్రీ ఆంజనేయం(Sri Anjaneyam), శ్రీ మంజునాథ, హనుమాన్ జంక్షన్, రామరామ కృష్ణ కృష్ణ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విశ్వక్ సేన్ (Vishwak Sen)తో అర్జున్ ఓ సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాతో తన కూతురిని తెలుగులో హీరోయిన్గా లాంచ్ చేద్దామని అర్జున్ భావించారు. అయితే పలు కారణాతో ఆ సినిమా అర్ధంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.