AP: RTC ఉద్యోగులకు డిజిటల్ ఐడెంటిటీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని RTC MD బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. RTC హౌస్లో గన్నవరం డిపోకు చెందిన 11 మంది సిబ్బందికి కార్డులను అందజేశారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు ఈ కార్డులు ఇచ్చారు. MAR 1 నుంచి ఐదేళ్ల వరకు ఈ కార్డులు అమలు కానున్నాయి. తర్వలోనే RTC ఉద్యోగులందరికీ కార్డులను అందిస్తామని MD తెలిపారు.