»No Films With Prabhas And Ram Charan Says Lokesh Kanagaraj
Lokesh kanagaraj: నా లిస్ట్ లో చరణ్, ప్రభాస్ లేరు..విక్రమ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
ప్రముఖ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) సూపర్ స్టార్ ప్రభాస్, రాం చరణ్ కోసం కొత్త స్క్రిప్ట్ రాస్తున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయాలపై లోకేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాగంగా క్లారిటీ ఇచ్చారు.
విక్రమ్, ఖైదీ, మాస్టర్ సినిమాలు తమిళంలోనే కాదు. తెలుగులోనూ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఈ మూవీలకు లోకేశ్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వం వహించగా, తాజాగా విక్రమ్ తో ఆయన బిజీ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు. ఆయన ప్రభాస్(prabhas) కోసం కొత్త కథను స్క్రిప్ట్ చేస్తున్నట్లు గత రెండు రోజులుగా సర్వత్రా పుకార్లు రావడం మొదలయ్యాయి. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(ram charan)తో యాక్షన్ చిత్రంలో నటించనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ విషయంపై కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు.
ఆ పుకార్లలో నిజం లేదు. ఖైదీ, విక్రమ్ కాలం నుంచి ఇటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ నేను నిజంగా వాటిని దృష్టిలో ఉంచుకుని ఏమీ వ్రాయలేదు. ప్రభాస్, రామ్ చరణ్ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు. వారి ఆతిథ్యం నాకు చాలా ఇష్టం. నేను కూడా వారితో ప్రాజెక్ట్‌లు చేయాలనుకుంటున్నాను. కానీ ప్రస్తుతం వారు పెద్ద లైనప్‌తో బిజీగా ఉన్నారు. అయితే నా చేతిలో విజయ్ సింహం ఉందని లోకేశ్ కనగరాజ్(lokesh kanagaraj) ఒక తమిళ మీడియాతో చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఆ ఇద్దరు హీరోలతో తాను సినిమాలు చేయడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. నిజానికి, లోకేష్ కనగరాజ్ చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఒక అభిమాని ప్రభాస్, చరణ్ గురించి అడగగా, అతను అదే విషయాన్ని స్పష్టం చేశాడు.
విక్రమ్ సినిమాతో లోకేష్ అందరినీ ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆయన తెలుగు స్టార్స్(telugu stars)తో సినిమా తీయాలని అందరూ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆయన ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇతర పెద్ద తెలుగు స్టార్స్ వంటి వారితో కలిసి పనిచేస్తున్నట్లు ఎప్పుడూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఆ దిశగా దర్శకుడు ఇప్పటి వరకు ఏమీ వర్క్ అవుట్ చేయలేదని తాజా క్లారిటీతో తెలిసింది.