JN: పాలకుర్తిలో గురువారం నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామ ఏంపిపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నల్ల లలితను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘనంగా సన్మానించారు. విద్యారంగంలో వారు చేసిన సేవలకు గాను వారికి ఈ గౌరవం దక్కింది. కాగా 18 మంది పిల్లలు ఉన్న మాదాపురం పాఠశాలలో ఎచ్ఏం వచ్చిన తర్వాత 100 మంది పిల్లలను చేర్పించారు.