చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నిరుపయోగంగా ఉన్న 6 అంబులెన్సులను అపోలో సంస్థ స్క్రాప్‌కి అప్పగించింది. ఈక్రమంలో శుక్రవారం ఉదయం అంబులెన్సును విడిభాగాలుగా కట్ చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో వాహనాలు కాలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.