యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ఆందోళనలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,362.48 పాయింట్లు కోల్పోయి 74671.94 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 456.35 పాయింట్ల నష్టంతో 23182.80 దగ్గర కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి.