W.G.పెంచిన గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని సీపీఐ నాయకుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. భీమవరం ప్రకాశంచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే విధంగా డొమెస్టిక్ సిలిండర్‌పై రు.60, వాణిజ్య సిలిండర్‌పై రు.115 పెంచడం దారుణమని విమర్శించారు.