E.G: టీడీపీ కార్యకర్తలు, నాయకులు ‘మై టీడీపీ యాప్’ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో జరిగిన మై టీడీపీ యాప్ ఇన్స్టాలేషన్ కాంపెయిన్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి తెలుగుదేశం కార్యకర్త యాప్ను తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు.