VZM: గంట్యాడ పోలీస్ స్టేషన్లో 2017లో నమోదైన 641 కిలోల గంజాయి రవాణా కేసులో 9 మంది నిందితులకు కోర్టు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా విధించిందని ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. కొటారుబిల్లి జంక్షన్ వద్ద మూడు వాహనాల్లో గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. విచారణ అనంతరం జడ్జి మీనాదేవి తీర్పు వెలువరించారన్నారు.