W.G: తాడేపల్లిగూడెం(M) వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ నెల 13 నుంచి 15 వరకు 12వ ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు తెలిపారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలోని 5 ప్రభుత్వ, 3 ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పాల్గొంటారన్నారు.