ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ తో పాటు.. వారి కుటుంబ సభ్యులు పలువురు గాయాలపాలయ్యారు. బాందీపురా నుంచి మైసూర్ వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రహ్లాద్ మోడీ కుటుంబీకులు ప్రయాణిస్తున్న సెడాన్ ఒక డివైడర్ను ఢీకొంది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. కడకోల ప్రాంతం వద్ద ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో ప్రహ్లాద్ మోదీతో పాటు అతని భార్య, కుమారుడు, కోడలు వాహనంలో ఉన్నారు. వీరిందరినీ మైసూరులోని BSS ఆసుపత్రికి తరలించారు.
ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ప్రహ్లాద్ మోదీ కుమారుడు మెహుల్ మోదీ, కోడలు జినాల్ మోదీ, మనవడు మహారథ్ మోదీతో పాటు డ్రైవర్ సత్యనారాయణ కూడా గాయాల పాలయ్యారు. ప్రహ్లాద్ మోదీ మనవడు మహారథ్ కాలికి ఫ్రాక్చర్ అవగా..మిగతా వారందరూ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.