Amarnath: తెలంగాణ డెవలప్మెంట్పై సీఎం కేసీఆర్ కామెంట్స్ అగ్గిరాజేశాయ్. తెలంగాణ భూముల విలువ పెరిగిందన్నారు. ఇక్కడ ఎకరం అమ్మితే ఏపీలో 5 నుంచి 10 ఎకరాల భూమి కొనొచ్చని పేర్కొన్నారు. దీనిపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Amarnath) కౌంటర్ అటాక్ చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉదహరించానని కేసీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబు ఏ సందర్భంలో అన్నారో తెలియదని.. కేసీఆర్ కామెంట్లపై అమర్ నాథ్ (Amarnath) రియాక్ట్ అయ్యారు.
విశాఖ చాలా డెవలప్ అయ్యిందని మంత్రి అమర్ నాథ్ (Amarnath) తెలిపారు. ఇప్పుడు విశాఖలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో భూముల కన్నా విశాఖలో ఎక్కువ ధర ఉన్నాయని స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను పట్టుకుని.. తెలంగాణ ఏదో జరిగిపోతుందని భావన కల్పిస్తున్నారని విమర్శించారు. ఈ విషయం గమనించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణం కాదు విజయవాడ, నర్సీపట్నం, ఇతర చోట్ల భూముల ధరలు భారీగా ఉన్నాయని మంత్రి అమర్ నాథ్ (Amarnath) స్పష్టంచేశారు.
భూముల ధరలను ఫ్రెండ్ చెబితే బాగుండేదని కామెంట్ చేశారు. ఆ మాట చంద్రబాబు చెప్పారని అనడంతో ఎవరూ నమ్మరని స్పష్టంచేశారు. రాజకీయ అవసరాల కోసం పొరుగు రాష్ట్రాలను, పొరుగు ప్రభుత్వాలను కించపరిచేలా కామెంట్ చేయడం సరికాదన్నారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో ఎకరాలు కొనొచ్చని కేసీఆర్ అన్నారు. ఒకప్పడిలా పరిస్థితి లేదని, ఉదహరించారు.