అందం, అభినయమే కాదు.. డ్యాన్స్ పరంగా దుమ్ముదులిపేస్తోంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ బ్యూటీదే హవా. ధమాకా సినిమా సక్సెస్ జోష్‌తో ఫుల్ ఫామ్‌లో ఉంది శ్రీలీల. డిసెంబర్ 23న రిలీజ్ అయిన ధమాకా మూవీ.. నాలుగు రోజుల్లోనే 41 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుందని ప్రకటించారు మేకర్స్. ఇది నిజంగానే మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. అందుకే థియేటర్లో మాస్ జాతర చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని మాస్ బీట్స్, శ్రీలీల డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. దాంతో శ్రీలీల టాలీవుడ్ ఫేవరేట్‌గా మారిపోయింది. ఫస్ట్ సినిమా పెళ్లి సందడితోనే బెస్ట్ ఛాయిస్‌గా మారిపోయిన ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు ధమాకా హిట్‌తో స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయినట్టేనని అంటున్నారు. దాంతో యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలు అమ్మడితో రొమాన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే అమ్మడు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. పైగా ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంతో తన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. గతంలోనే కోటి డిమాండ్ చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు డబుల్ చేసిందని టాక్. ఇకపై ఏ సినిమా చేసిన కోటిన్నర నుంచి రెండు కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరోలతో పాటు.. ఎన్బీకె 108లో బాలయ్య కూతురుగా నటిస్తోంది. అంతేకాదు మహేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 28లోను ఛాన్స్ అందుకున్నట్టు టాక్.