ATP: అనారోగ్యంతో అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.