W.G: నరసాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన 14 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి తన ఇంటి ప్రాంగణంలో అనుమతి లేకుండా వీటిని ఉంచినట్లు గుర్తించారు. తహశీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెరుపు దాడిలో నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించి గ్యాస్ సిలిండర్లు నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.