AP: రాష్ట్రంలో జిల్లాల విభజన ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈనెల 13న కేబినెట్ సమావేశం తర్వాత కొత్త జిల్లాల ప్రాతిపదికన సీఈవోలను ప్రభుత్వం నియమించనుంది. 28 జిల్లాలకు కొత్త సీఈవోలతో పాటు డిప్యూటీ సీఈవోలు, GSWS అధికారులు, DRDA PDలు, డ్వామా పీడీలను ప్రభుత్వం నియమిస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులకు ఫైనాన్స్ శాఖ అప్రూవల్ జరగనుంది.