ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ రాబోతోందా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వాస్తవానికి సుకుమార్ ఫస్ట్ ఫిల్మ్ ‘ఆర్య’ను ప్రభాస్‌తో చేయాలనుకున్నాడు సుకుమార్. కానీ ఎందుకో వర్కౌట్ అవలేదు. అయితే ఆర్య తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు సుకుమార్. కానీ ప్రభాస్‌తో మాత్రం సినిమా సెట్ అవలేదు. అయితే.. ఇప్పుడు ప్రభాస్, సుకుమార్ కాంబోలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, మారుతి సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. సుకుమార్ పుష్ప2 తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత మరో ప్రాజెక్ట్ కమిట్ అవలేదు సుక్కు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా అనౌన్స్ చేసినా.. ఇప్పుడు కష్టమంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం సుకుమార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. రీసెంట్గా ప్రభాస్‌తో ఓ ఐడియా చెప్పగా.. ఓకే చెప్పినట్టు టాక్. ఈ సినిమాను ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2.. వంటి సినిమాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారని సమాచారం. ఆ మధ్య సుకుమార్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించాడు అభిషేక్ అగర్వాల్. ఇటీవల ప్రభాస్‌ను కూడా కలిసాడు. దాంతో సుకుమార్, ప్రభాస్ కాంబో ఫిక్స్ అని అంటున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 2024లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఏదేమైనా.. ఒకవేళ ప్రభాస్, సుకుమార్ కలిస్తే పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అని చెప్పొచ్చు.