నల్గొండలో నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు విస్తరణలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితులు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ పనులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో చర్చలు జరిపారు.