KRNL: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో వేలాది మంది దరఖాస్తు చేస్తున్నారు. ప్రొవిజనల్ ఎంపిక జాబితా ఈ నెల 19న, తుది ఎంపిక 28న ప్రకటించనున్నారు. కర్నూలు జిల్లాలో 55 పోస్టులు భర్తీ చేయనున్నారు.