ప్రముఖ రాజకీయ నేత బొడ్డేపల్లి రాజగోపాల్రావు 103వ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని సెవెన్ రోడ్డు జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి గురువారం ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ గోపాల్ రావు గొప్ప రాజకీయ మేధావిగా గుర్తింపు పొందారని తెలిపారు. వరుసగా ఆరు పర్యాయాలు శ్రీకాకుళం ఎంపీగా ప్రజలకు సేవలందించారన్నారు.