బాలీవుడ్ (Bollywood) హీరోయిన్లపై ఈమధ్య ఎక్కువగా కేసులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసు (check bounce case)లో చాలా మంది హీరోయిన్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. బాలీవుడ్ నటి అమీషా పటేల్ (Ameesha Patel) ఓ చెక్ బౌన్స్ కేసులో ఝార్ఖండ్ లోని రాంచీ కోర్టులో లొంగిపోయారు. మూవీ ప్రొడక్షన్ (Movie production)పేరిట అమీషా పటేల్ తన నుంచి రెండున్నర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని, తన డబ్బు ఎగ్గొట్టారని నిర్మాత, వ్యాపారవేత్త అజయ్ కుమార్ రాంచీ కోర్టు(Court of Ranchi)ను ఆశ్రయించారు. అమీషా పటేల్ సినిమా పూర్తి చేయకపోగా, తన డబ్బు తిరిగి ఇవ్వలేదని, అసలు రూ.2.5 కోట్లకు వడ్డీ రూ.50 లక్షలు అయిందని, మొత్తం రూ.3 కోట్లు చెల్లించేలా అమీషా పటేల్ ను ఆదేశించాలని అజయ్ కుమార్ (Ajay Kumar) కోర్టును కోరారు.
నిర్మాత పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న రాంచీ కోర్టు ఈ ఏప్రిల్ 6న అమీషా పటేల్‌కు సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ రాంచీ వచ్చిన అమీషా పటేల్ న్యాయమూర్తి (Judge) ఎదుట లొంగిపోయారు. అనంతరం న్యాయ స్థానం ఆమె షరతులతో కూడిన బెయిల్ (Bail) కూడా మంజూరు చేసింది. దాంతో కోర్టు బయటికి వచ్చిన ఆమె వెంటనే స్పీడ్ గా స్పందించి.. తలకు ముసుగు కప్పకుంది.. మీడియాను చూసి తలకు ముసుగు కప్పుకుంది. కోర్టులో ఏం జరిగిందో చెప్పమని మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించినా ఆమె పట్టించుకోకుండా కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది.అమీషా పటేల్ తెలుగులో పవన్ కల్యాణ్ సరసన బద్రి సినిమా(Badri movie)లో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె మళ్లీ తెలుగులో కనిపించలేదు.
बिहार अभिनेत्री अमीषा पटेल ने रांची की सिविल कोर्ट में किया सरेंडर, मामला चेक बाउंस से जुड़ा है ,कोर्ट ने उन्हें 21 जून को दोबारा पेश होने का निर्देश दिया है ,,,,