PPM: జిల్లాలోని విద్యా సంస్థలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని DMHO డా భాస్కర రావు తెలిపారు. ఇలా వస్తారు, అలా వెళ్ళిపోతారు అనే కథనంపై ఆయన పై విధంగా బుధవారం స్పందించారు. గిరిజన సంక్షేమ, తదితర పాఠశాలల్లో ఆరోగ్య సిబ్బంది క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు.